ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం

ABN, Publish Date - May 25 , 2025 | 01:02 AM

భారత సైనికు లు ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతం చేసి పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య అన్నారు.

తిరంగా యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి

కళ్యాణ్‌నగర్‌, మే 24(ఆంధ్రజ్యోతి): భారత సైనికు లు ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతం చేసి పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య అన్నారు. శనివారం రాత్రి భారత సైనికులకు మద్దతు గా ’మనం సైతం దేశం కోసం తిరంగా యాత్ర’ను గోదావరిఖని చౌరస్తా నుంచి రీగల్‌ షూమార్ట్‌, లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్‌ను ఓడించాలని విదేశీ శక్తులు కుట్ర పన్నినప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ను భారత బలగాలు విజయవం తం చేశాయన్నారు. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మోదీ భారత్‌ను స్వయంగా ఎదగ డానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రక్షణ వ్యవస్థను పటిష్ఠ పరిచారని, మన దేశ సైనికులు వైమానిక రక్షణ దళాలు పాకిస్థాన్‌ కు, ఉగ్రవాదులకు దిమ్మ తిరిగేలా బుద్ధి చెప్పార న్నారు. నరేంద్రమోదీ 24 గంటలు దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నారని, దేశా న్ని అభివృద్ధి పథంలో న డిపిస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో బీజే పీ నాయకులు మేరుగు హన్మంతుగౌడ్‌, బల్మూరి వనిత, అమరేందర్‌రావు, పిడుగు కృష్ణ, కోమళ్ల మహేష్‌, జక్కుల నరహరి, గుండబోయిన భూమయ్య, కోడూరి రమేష్‌, ముస్లీం మైనార్టీ నాయకులు నజీమోద్దీన్‌, హమీద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 01:02 AM