అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:05 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేసూ ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫ్లెక్సీ దహ నం చేసి నిరసనలు తెలిపారు.
సిరిసిల్ల టౌన్, జూలై 27 (ఆంధ్రప్రదేశ్) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేసూ ఆదివారం జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఫ్లెక్సీ దహ నం చేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కంచర్ల రవిగౌడ్ మాట్లాడారు. ఆంధ్ర నాయకుల దృష్టి ఎప్పుడు తెలంగాణపైనే ఉంటుందని తెలంగాణకు నష్టం చేయాలనే ఆలోచనలతో ఉన్నారని ఆరోపిం చారు. మళ్లీ తెలంగాణలో పాగ వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కేటీఆర్‌కు క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మట్టె శ్రీనివాస్, ముద్దం అనిల్‌గౌడ్, కోడం వెంకటేశం, ఎస్‌కే అఫ్రోజ్, హరీష్, రాము, పవన్ పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 01:06 AM