ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల సమస్యలపై మాట్లాడితే కేసులు..

ABN, Publish Date - May 07 , 2025 | 12:46 AM

రైతు సమస్యలపై మాట్లా డితే ఇతర పార్టీ నాయకులపై కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌లపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతారా అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

గంభీరావుపేట, మే 6 (ఆంధ్రజ్యోతి) : రైతు సమస్యలపై మాట్లా డితే ఇతర పార్టీ నాయకులపై కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌లపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతారా అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్‌ సందర్శించారు. రైతుల సమ స్యలను అడిగితెలుసుకున్నారు. అప్పులు పుడతలేవు, పంట దిగుబ డి తగ్గింది.. వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేం ద్రాల్లో ఈ పరిస్థితి సారూ.. అంటూ బండి సంజయ్‌తో రైతులు గోడు వెల్లబోసుకున్నారు. వానోస్తే టార్పాలివ్‌ కవర్లు కూడా లేవు.. కిలోల కొద్ది కోత పెడుతున్నారు అంటూ వాపోయారు. ఈ సంద ర్భంగా బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీసం వారి గోడు వినడానికి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ నాయకులు రావడం లేదన్నారు. ధాన్యం కొనుగో లు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొంటుందని, సుతిలు తాడు, గోనెసంచి, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు, లేబర్‌ పైసలు... ఇలా అన్ని పైసలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంటే కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందో చెప్పాలన్నారు. 25రోజులుగా ధాన్యం కొను గోళ్ళకు అతీగతీ లేదని, ఇంత దరుణం ఎక్కడా లేదన్నారు. కరీంనగ ర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 580 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారని, ఈ రెండు జిల్లాలో 7 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ ఉంటే, ఇప్పటివరకు రెండున్నర లక్షలు కూడా దాటలేదన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఇదేపరిస్థితి ఉందన్నారు. నిన్నమొన్న పడిన వర్షాలతో రైతు లకు చాలా నష్టం వాటిల్లిందని, ధాన్యం ఎండకు ఎండుతోందని, వానకు తడుస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో, ఆ తరువాత.. ఇలా రెండుసార్లు కటింగ్‌ చేస్తుండటంతో ఒక్క క్వింటా లుకు కిలోల చొప్పును నష్టం వస్తోందన్నారు. మండల స్థాయి అధి కారులకు, జిల్లా అధికారులకు పూర్తిస్థాయి స్వేచ్చ ఇస్తే సమస్య ఉండేది కాదని, రాజకీయ జోక్యంతోనే ఇబ్బందులు ఏర్పడుతున్నా యన్నారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే పోలీస్‌లపై ఒత్తిడితెచ్చి కేసు లు పెడుతున్నారన్నారన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో ఈ ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే అరాచకం చేస్తుం దన్నారు. వడ్ల డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కొనేది కేంద్ర ప్రభుత్వమే మధ్యలో మీడియటర్‌గా ఉండే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వా నికి వచ్చిన ఇబ్బంది ఏంటో ఇప్పటికైనా చెప్పాలన్నారు. చివరికి ముఖ్యమంత్రి తనతో ఏమికాదని, చేతులు ఎత్తేశాడని గుర్తుచేశారు. యుద్ధప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని, వడ్ల డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల బీజేపీ అధ్య క్షుడు గంట అశోక్‌, జిల్లా అధికార ప్రతినిధులు గడ్డమీది ప్రసాద్‌ రెడ్డి, దెవసాని కృష్ణ, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కోడె రమేష్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్‌యాదవ్‌, మాజీ ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, నా యకులు రాజిరెడ్డి, సత్యనారాయణ, స్వామి, నాగరాజు, రాజు తదిత రులు ఉన్నారు. కాగా, నర్మాల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యం లో జరుగుతున్న మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. శివలింగసహిత మడేలేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీ నాయకుడికి పరామర్శ

మండలకేంద్రంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దెవసాని కృష్ణ ను బండి సంజయ్‌ పరామర్శించారు. ఇటీవల కృష్ణ తండ్రి జనార్దన్‌ మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Updated Date - May 07 , 2025 | 12:46 AM