ఇసుక, మట్టి పక్కదారి పట్టిస్తే ‘ఎస్మా’ ప్రయోగిస్తాం..
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:54 AM
ఇసుక, మట్టి పక్కదారి పట్టించినా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇసుక సరఫరా చేయాలనే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని డీఆర్డీవో శేషాద్రి హెచ్చ రించారు.
తంగళ్లపల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఇసుక, మట్టి పక్కదారి పట్టించినా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇసుక సరఫరా చేయాలనే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని డీఆర్డీవో శేషాద్రి హెచ్చ రించారు. బుధవారం తంగళ్లపల్లి మండలంలోని ఇంది రమ్మ కమిటీ సభ్యులు, కార్యదర్శులు, ట్రాక్టర్ అసోసి యేషన్ ప్రతినిధులతో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మట్టి సరఫరా గురించి అధికారులు సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల కు ఇసుక, మట్టి వారానికి రెండు రోజులు అనుమతి ఇస్తామన్నారు. ఇసుక బుధవారం, శుక్రవారాలు అను మతిస్తామని మట్టి మంగళవారం, గురువారాలలో ఉద యం 9 గంటల నుంచి మధ్యహ్నం 1 గంట వరకే అనుమతి ఇస్తామన్నారు. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా సిఫారసు లెటర్ తెస్తేనే అనుమతి ఉంటుందన్నారు. నిబం ధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు, గుట్టల నుంచి మట్టిని తీస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పట్టా భూము లు, చెరువుల నుంచి అనుమతి తీసుకుని మట్టిని ఇందిరమ్మ ఇళ్లకు తరలించాలన్నారు. ఇందిర్మ ఇళ్లకు ట్రాక్టర్ ఇసుక రూ. 15వందలకే సరఫార చేయాలని లేకుంటే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. పది ట్రిప్పుల ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు సరిపోవ డం లేదని ఆదనంగా 5 ట్రిప్పుల ఇసుక ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అన్ని గ్రామా లకు రూ.15వందలకే ట్రాక్టర్ ఇసుకను సరఫరా చేయలేమని ట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. దృష్టి సారించాలని అధికారులను కోరారు. ఉన్నాతాధికారులు ఇసుక, మట్టి తరలింపు లో సిరియాస్‌గా ఉన్నారని నిబందనలు ఉల్లంఘించ వద్దని తహ సీల్దార్ జయంత్‌కుమార్ సూచించారు. కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఇండ్లను పరిశీలించి మట్టి ఏ మేరకు అవసరం ఉంటుందో గుర్తించి ట్రాక్టర్ నంబర్, జేసీబీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతివ్వాలని ఎంపీడీవో లక్ష్మీనారాయణ పంచాయతీ కార్యద ర్శులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీవో మీర్జా, హౌసింగ్ ఏఈ హమీద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జల్గం ప్రవీణ్, డైరెక్టర్లు పొన్నాల పర్శ రాములు, ఆరేపల్లి బాలు, తిరుపతిరెడ్డి, ఇట్టిరేడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ట్రాక్ట ర్ అసోసియేషన్ ప్రతినిధులు భాస్కర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
పనులు, కూలీల మస్టర్ వివరాలు సక్రమంగా నమోదు చేయాలి
ఉపాధిహామీ పనులను, కూలీల మాస్టర్‌లను సక్రమంగా నమో దు చేయాలని డీఆర్డీవో శేషాద్రి ఆదేశించారు. బుధవారం తంగళ్లప ల్లి మండల ఉపాధిహమీ కార్యాలయాన్ని డీఆర్డీవో సందర్శించారు. ఆన్‌లైన్ నమోదుతోపాటు హార్డ్ కాపీలలో నమోదు చేస్తున్న ఆంశా లను పరిశీలించారు. ఆన్‌లైన్ తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏపీవో నాగరాజు, ఇన్‌చార్జీ ఎపీవో రాజనర్సులు ఉన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 12:54 AM