ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నగునూర్‌లో గుప్త నిధుల వేట

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:09 AM

కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని నగునూర్‌లో గుప్త నిధుల కోసం వేటసాగుతోంది. గ్రామంలోని పురాతన రామలింగాల దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకానికి ప్రయత్నించారు.

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని నగునూర్‌లో గుప్త నిధుల కోసం వేటసాగుతోంది. గ్రామంలోని పురాతన రామలింగాల దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకానికి ప్రయత్నించారు. సోమవారం సాయంత్రం కొంత మంది గ్రామ యువకులు అటువైపు వెళ్లారు. అక్కడ రెండు కార్లు, ఎక్‌సకావేటర్లు, ట్రాక్టర్‌లు కనిపించాయి. అనుమానంతో దగ్గరికి వెళ్తుండగా అక్కడున్నవారు పరారయ్యారు. ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. కొన్ని రోజులగా ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నా ఎవరూ పసిగట్టలేక పోయారు. గ్రామస్థులు వస్తున్నారనే సమాచాచంతో ఎక్స్‌కావేటర్‌తోపాటు రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలతో పరారయ్యారని తెలిపారు. గతంలోనూ గుడిలోనే ఆంజనేయ స్వామికి బంధనం వేసి గుప్త నిధుల కోసం ప్రయత్నించిన దుండగులకు నిరాశ మిగిలింది. అంతేకాకుండా సమీపంలో ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేసే సమయంలో పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

Updated Date - Jun 03 , 2025 | 12:09 AM