ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామ పంచాయతీకి వెళ్లేదెలా?

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:44 AM

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామపంచాయతీ భవనం జాతీయ రహదారి నిర్మాణంతో మరుగునపడి పోయింది. జాతీయ రహదారి గ్రామపంచాయతీ వరకు విస్తరించడంతో పాటు రహదారి ఎత్తుగా నిర్మించడంతో గ్రామపంచాయతీ భవనంలోకి గ్రామ ప్రజలు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.

శంకరపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామపంచాయతీ భవనం జాతీయ రహదారి నిర్మాణంతో మరుగునపడి పోయింది. జాతీయ రహదారి గ్రామపంచాయతీ వరకు విస్తరించడంతో పాటు రహదారి ఎత్తుగా నిర్మించడంతో గ్రామపంచాయతీ భవనంలోకి గ్రామ ప్రజలు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. 30సంవత్సరాల క్రితం జాతీయ రహదారి పక్కన నిర్మించిన గ్రామపంచాయతీ భవనంతో పాటు గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. నిత్యం సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలతో కళకళలాడే గ్రామపంచాయతీ భవనం నేడు కళావిహీనంగా మారింది. జాతీయ రహదారి విస్తరణలో గ్రామపంచాయతీ వరకు రోడ్డు నిర్మాణం జరగడంతో గాంధీ విగ్రహాన్ని తొలగించారు. రహదారి జీపీ భవనం కంటే ఎత్తులో నిర్మించడంతో గ్రామపంచాయతీ భవనం కనిపించకుండా పోయింది. మండలంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎక్కడ లేకపోవడంతో గాంధీజీ జయంతి, వర్థంతి వేడుకలు అధికారులు, ప్రజాప్రతినిధులు కొత్తగట్టులోనే నిర్వహించేవారు. ఇప్పుడు రహదారి విస్తరణలో గాంధీజీ విగ్రహం తొలగించారు.

ఫ ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

ప్రజలు వారి సమస్యలను అధికారులకు చెప్పుకోవడానికి, విద్యుత్‌, నల్లా బిల్లులు, తదితర చెల్లించడానికి గ్రామపంచాయతీకి రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అనువైన స్థలంలో కొత్త గ్రామపంచాయతీ భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:44 AM