విద్యతో ఉన్నత లక్ష్యాలు సాధ్యం
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:53 AM
విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నా రు.
తంగళ్లపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నా రు. బుధవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్‌లో ఆన్ అకాడమీ ద్వారా ఆన్‌లైన్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, కాంగ్రేస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లడుతూ పేదలు అధికంగా ఉండే ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పిల్లలకు జాతీయస్థాయి పోటీ పరీక్షలు రాసేందుకు ఆన్‌లైన్ తరగుతుల ద్వారా మంచి శిక్షణ ఉచితంగా అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి రోజు కనీసం 2 గంటల పాటు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు పదోతరగతి, ఇంటర్ మీడియాట్ విద్యా కీలకమని ఆన్‌లైన్ క్లాస్‌లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల కు ఏమైన ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకు నిరంతరం కృషి చేస్తోందని, పేదలకు అధికంగా నిధులు ఖర్చు చేస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లాలో పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిం చేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారన్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రతిభకనబర్చాలని సూచించారు. కార్యక్ర మంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ జయంత్‌కు మార్, ప్రిన్సిపాల్ విఠల్, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:53 AM