రాజన్న గోశాలలో నిత్యం కోడెలను పర్యవేక్షించాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:24 AM
వేములవాడ రాజరాజే శ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన రెండు గోశాలల్లో కోడెలను నిత్యం పర్యవేక్షిస్తూ సంరక్షించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ రాజరాజే శ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన రెండు గోశాలల్లో కోడెలను నిత్యం పర్యవేక్షిస్తూ సంరక్షించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవా లయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలతోపాటు దేవాలయానికి సమీపంలోని గోశాలలో పని చేసేందుకు ఇటీవల ఎంపిక చేసిన వారికి గోశాలల్లో చేపట్టాల్సిన పనులు, చేయాల్సిన విధులపై జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్‌తో కలిసి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డిలు అవగాహన కల్పించారు. అనంతరం గోశాలల్లో పనిచేసేందుకు నియామకమైన వారి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. అలాగే పశువుల సంరక్షణపై పశువైధ్యాధికారి డాక్టర్ శ్రీధర్ పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు ప్రతి రోజు కోడెలకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా, మూడు సార్లు ఇవ్వా ల్సి ఉంటుందని వాటికి నిత్యం పరిశుభ్రమైన నీరును అందుబాటులో ఉంచాలని సూచించారు. కోడెలు ఉండే పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రం గా ఉండేల చూసుకోవాలని సూచించారు. అలాగే కోడెల ఆరోగ్య పరిస్ధి తిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గోశాలలోని పశువైధ్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని అదేశించారు. గోశాలలో పశువైధ్యాధికారి సహాయకులు అటెండర్‌లు అందుబాటులో ఉంటారని తెలిపారు. గోశాలలోని కోడెల కు సీజనల్‌గా అన్ని టీకాలు వేసేలా చూసుకోవాలని జిల్లా పశుసంవ ర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి సూచించారు.
Updated Date - Jun 20 , 2025 | 12:24 AM