ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:51 AM

రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధానత్యను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు.

వేములవాడ కల్చరల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధానత్యను ఇవ్వాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా అన్నారు. తిప్పాపూర్‌ గోశాలలో శుక్రవారం 100 కోడెలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న రైతుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు 375 జతల కోడెలు(750 కోడెలు) రైతులకు పంపిణీ చేశామన్నారు. గోశాల నుంచి పంపిణీ చేసిన కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. కోడెలు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాజన్న కోడెలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అప్జల్‌ బేగం, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:51 AM