అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
ABN, Publish Date - May 31 , 2025 | 12:40 AM
జిల్లాలో జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్‌బీ గీతేలు ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్‌బీ గీతేలు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకలు పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతాయన్నారు. జిల్లాలలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధిం చి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్‌లను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పా ట్లు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిచేయా లని ఆదేశించారు. ప్రొటోకాల్ ప్రకారం సిట్టింగ్‌లను ఏర్పాటు చేయాల న్నారు. వేడుకల వద్ద వైద్యశిబిరాలను ఏర్పాటుచేయాలని అవసరమైతే తాగునీరు సరఫరాల పనులు మున్సిపల్ అధికారులు ఏర్పాటుచేయాల న్నారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రొటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరి కి అందించాలన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హాజయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. ముఖ్యఅతిథి అందించే సందేశాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు ల మేరకు ముఖ్యఅతిథి గౌరవ వందనం, ఇతర కార్యక్రమాలకు బందో బస్తులను పోలీసులు ఏర్పాట్లుచేయాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 12:40 AM