ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారులకు ప్రభుత్వం అండ..

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:06 AM

మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ తెలిపారు.

సిరిసిల్ల, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ తెలిపారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని చంద్రంపేట రైతు వేదికలో నేషనల్‌ అగ్రో ఫౌం డేషన్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఉత్తమ ప్రతిభకనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసాప త్రాలు అందజేసి సన్మానించారు. అనంతరం చేపల స్టాళ్ల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మంత్రి శ్రీహరి ఇటీవల కరీంనగర్‌ వచ్చినప్పుడు వారితో చేపల పెంపకం, మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. ప్రభు త్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేపపిల్లలు పంపిణీ చేస్తుందని తెలిపారు. బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు. గతంలో మిడ్‌మానేరులో చేప లను వదలడం జరిగిందని, మల్కపేట్‌ రిజర్వాయర్‌ కూడా అందు బాటులోకి వచ్చిందని వాటిలో కూడా చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మర మ్మతులు పూర్తి చేశామని అన్నారు. ఇంకా ఎక్కడ చెరువులు మర మ్మతులు ఉంటే చేపడతానని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే కథలాపూర్‌ మండలంలోని తెగిపోయిన చెరువు లను మరమ్మతులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో కేజీ కల్చర్‌ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని, కేజీ కల్చర్‌ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు. చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చుకోవాలన్నారు. కేజీ కల్చర్‌ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. దేశంలో మత్స్య సంపద పెరగాలని, చేపలు ఆరోగ్యానికి మంచిదని, ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు. గత ప్రభు త్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొన సాగిస్తూ నూతన పథకాలను అమలుచేస్తున్నామన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, రూ 500కు సిలిండర్‌, రూ10లక్షల ఆరోగ్యశ్రీ, 10 సంవ త్సరాలుగా పేదలు ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్‌కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూపరెడ్డి, జిల్లా ఫిషరీస్‌ చైర్మన్‌ చొప్పరి రామ చంద్రం, డీఏవో అఫ్జల్‌బేగం, మల్లికార్జున్‌, పి కిషోర్‌, నేషనల్‌ ఆగ్రో ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సునీల్‌కుమార్‌, అడ్వైజర్‌ విద్యాసాగర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌,సంగీతం శ్రీనివాస్‌, గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:07 AM