ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యారంగాన్ని పరిరక్షించాలని తెలంగా ణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యారంగాన్ని పరిరక్షించాలని తెలంగా ణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చది వించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రభుత్వం విద్యారంగాన్ని పరిరక్షించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వ ర్యంలో చేపట్టిన ప్రచార జాతాలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో మంగ ళవారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లల్లో జరిగిన ప్రచార జాతా కార్యక్రమాల్లో నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు. ప్రాథమిక పాఠశా లల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతు లను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ, కార్యవర్గ సభ్యులు నాగమణి, టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మనమూర్తి, రాష్ట్ర కార్యదర్శి గోల్కోండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్‌రావు, కోశాధికారి అంబటి రమేష్, కార్యదర్శు లు పాముల స్వామి, కోత్వాల్ ప్రవీణ్, తిరుపతి జాదవ్, సిరామరాజు, సిలువేరి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:40 AM