ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తి శ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:22 AM

జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో చర్చిలు కిట కిటలాడాయి.

భూషణరావుపేటలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

జగిత్యాల క్రైం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో చర్చిలు కిట కిటలాడాయి. భక్తుల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక గీతాలు ఆలపించారు. పాపులను రక్షించడం కోసమే యేసు క్రీస్తు సిలువపై ప్రాణ త్యాగం చేశారని ఆయా చర్చిల ఫాదర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన స్వీకర్‌ డాక్టర్‌ సందీప్‌ భార్గవ్‌, ఫాస్టర్‌ అబ్రహం, నిర్వాహకులు మోహన్‌ రావు, రవి, సామేల్‌ తదితరులు ఉన్నారు.

ఫబీర్‌పూర్‌: బీర్‌పూర్‌ మండలంలోని మంగేళ, కొల్వాయి, నర్సింహులపల్లి, ఇందిరానగర్‌, బీర్‌పూర్‌ గ్రామాలలోని పలు చర్చిల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు పౌలు, జోషప్‌, రవి, ఇస్సాక్‌, క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఫకథలాపూర్‌: మండలంలోని పలు గ్రామాల్లో గుడ్‌ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కథలాపూర్‌, భూషణరావుపేట, తాండ్ర్యాల, బొమ్మెన చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రైస్తవులతో చర్చిలు కిటకిటలాడాయి. ఈ కార్యక్రమాల్లో పాస్టర్లు మిట్టపల్లి కిషన్‌, సామ్యుల్‌, ఏకోబు, గాంధారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:22 AM