ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గెట్‌.. సెట్‌.. షూట్‌

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:33 AM

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం పోలీసు అధికారుల వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభమైంది.

కరీంనగర్‌ క్రైం, జూలై 30(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం పోలీసు అధికారుల వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభమైంది. సీపీ గౌస్‌ ఆలం ఈ శిక్షణను ప్రారంభించారు. ఆయన ఆయుధాలను ఉపయోగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఫౖరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహిస్తారన్నారు. రెండు రోజుల పాటు ఈ ప్రాక్టీస్‌ కొనసాగుతుందని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలోని కొత్తపల్లి పోలీసు ఠాణా పరిధిలోని ఎలగందల్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ ప్రాక్టీస్‌ జరుగుతున్నది. ఈ ఫైరింగ్‌లో 0.9 ఎంఎం పిస్టల్‌, ఏకె-47 రైఫిల్‌, ఇతర ఫైర్‌ ఆర్మ్స్‌తో పోలీసు అధికారులు ప్రాక్టీస్‌ చేశారని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలోని అధికారులందరూ ఈ శిక్షణలో పాల్గొని ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 31 , 2025 | 12:33 AM