ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలి

ABN, Publish Date - May 21 , 2025 | 11:58 PM

ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్‌ భగత్‌నగర్‌లో పర్యటించారు. పలు కాలనీల్లో పాదయాత్రగా పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు.

మాట్లాడుతున్న కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

- నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్‌ భగత్‌నగర్‌లో పర్యటించారు. పలు కాలనీల్లో పాదయాత్రగా పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. శివాలయం వద్ద పలు అపార్ట్‌మెంట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్లలో ఉత్పత్తి అవుతున్న చెత్తను వందశాతం సెగ్రిగేషన్‌ చేయాలన్నారు. మూడు డబ్బాల్లో తడి చెత్తను, పొడి చెత్తను, ఇతర చెత్తను ఇలా మూడు రకాలుగా వేరు చేయాలని అన్నారు. తడి చెత్తను అపార్ట్‌మెంట్‌ ఆవరణలోనే హోం కంపోస్టు చేయాలన్నారు. పొడి చెత్తలోని డబ్బాలు, అట్టముక్కలు, తదితర వస్తువులను పారిశుధ్య కార్మికులకు అందిస్తే డీఆర్‌సీసీ సెంటర్లకు రీసైక్లింగ్‌ కోసం తరలిస్తారని తెలిపారు. చెత్తను వేరుచేయడం ద్వారా డంపుయార్డుకు వెళ్లే చెత్త శాతం తగ్గుతుందన్నారు. హోం కంపోస్టు ఎరువులను ఇంట్లో మొక్కలకు వాడుకోవాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ స్వామి, అపార్ట్‌మెంట్‌ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:58 PM