ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి

ABN, Publish Date - May 27 , 2025 | 12:24 AM

రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ అన్నారు. జిల్లాలో రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు బంగారు రైతు రథాలను సోమవారం గంగాధరలో ఆమె ప్రారంభించారు.

కరీంనగర్‌ అర్బన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌ అన్నారు. జిల్లాలో రైతులకు ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు బంగారు రైతు రథాలను సోమవారం గంగాధరలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్ల పాటు కష్టపడితే 30 సంవత్సరాల పాటు రైతులకు నికర ఆదాయం వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ సాగుకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. లోహియా ఆయిల్‌ ఫామ్‌ ప్లాంటేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌ ఫామ్‌సాగుపై జిల్లాలో నెలరోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. లోహియా కంపెనీ సీఈవో సిద్ధాంత్‌ లోహియా మాట్లాడుతూ జిల్లాలో విలేజ్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో భాగంగా ఆయిల్‌పామ్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామానికి ఈ రథాలు వెళ్లి సదస్సులు నిర్వహిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ సంస్థ నిర్వాహకులు ప్రతిక్‌ పట్నాయక్‌, ఐలయ్య, రోహిత్‌, మంజువాణి, రవళి, లోహియా సంస్థ జిల్లా మేనేజర్‌ భరత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:24 AM