విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:47 AM
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు.
- ఎస్పీ అశోక్ కుమార్
బీర్‌పూర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం బీర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ పరిసరాలు, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు దర్యాప్తు విషయంలో అఽధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజల ఫిర్యాదులలో ఏలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు. బ్లూ కోల్స్ట్, పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్‌కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ప్రతీరోజు గమనిస్తూ ఉండాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా విలేజ్ పోలీస్ అఽధికారులు తరచుగా గ్రామాలను పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, ప్రజలకు చట్టాలపై, డయల్ 100, షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. సిబ్బంది, అఽధికారులు విధులను సక్రమంగా నిర్వహించడం దార్వరానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపర్చాలని సూచించారు. ఆయన వెంట బీర్‌పూర్ ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:47 AM