ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిట్‌నెస్‌ పరీక్ష..

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:34 AM

పాఠశాలల్లో అడుగుపెట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. కానీ వారు బడికి వెళ్లే బస్సులు మాత్రం సిద్ధం కావడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాల బస్సులు రోడ్డెక్కాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి అని తెలిసినా యాజమాన్యాలు ఏటా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ మొదలు పెడితే కానీ ముందుకు రాని పరిస్థితి ఉంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి రవాణా శాఖ అధికారులు ముందగానే అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు.

- జిల్లాలో 165బస్సులు.. ఫిట్‌నెస్‌ పొందినవి 97..

- ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డు మీదికి వస్తే సీజ్‌ తప్పదు

- నిశితంగా పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు

- ఈనెల 15 తరువాత స్పెషల్‌ డ్రైవ్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పాఠశాలల్లో అడుగుపెట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. కానీ వారు బడికి వెళ్లే బస్సులు మాత్రం సిద్ధం కావడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాల బస్సులు రోడ్డెక్కాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి అని తెలిసినా యాజమాన్యాలు ఏటా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ మొదలు పెడితే కానీ ముందుకు రాని పరిస్థితి ఉంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి రవాణా శాఖ అధికారులు ముందగానే అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. విద్యాసంస్థలు జూన్‌ 12 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ప్రతి యేటా యజమానులు బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారనే అరోపణలు ఉన్నాయి. ఈనెల 15 తరువాత స్పెషల్‌ డ్రైవ్‌ కూడా నిర్వహించనున్నారు. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్డు మీదికి వస్తే సీజ్‌ చేయనున్నారు. జిల్లాలో 165 బస్సులు ఉండగా, 97 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించారు. 65 బస్సులు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది. పాఠశాలలు, కళాశాలలకు వినియోగించే బస్సులు వాహన రిజిస్ట్రేషన్‌ అయిన నుంచి 15 ఏళ్లు మాత్రమే రోడ్డుమీద తిరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బస్సులు జిల్లాలో మూడు ఉన్నట్లు గుర్తించారు. రవాణా శాఖ ఫిట్‌నెస్‌ విషయంలోనూ 15 ఏళ్లు దాటిన బస్సులపై పూర్తిగా కఠినంగా వ్యవహరించడంతో పాటు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌లేని వాహనాల్లో స్కూల్‌ పిల్లలను తీసుకవెళ్లి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌

ఆన్‌లైన్‌లో విద్యా సంస్థ పూర్తి వివరాలు, వాహన యజమాని వివరాలతో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. చిన్న వాహనానికి రూ.800, పెద్ద వాహనానికి రూ.వెయ్యి రుసుము చెల్లించాలి. పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ అదనంగా ఉంటుంది. ఫిట్‌నెస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న తేది సమయం కేటాయించిన రోజు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి బస్సును ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకోవాలి. తరువాత సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

ఫ ఫిట్‌నెస్‌ నిబంధనలు ఇవీ...

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలు పొందడానికి నిబంధనలు ఖచ్ఛితంగా పాటించాలి. ఇందుకు కఠినంగానే నిబంధనలు పరిశీలిస్తున్నారు.

- విద్యార్థులను పరిమితికి మించి తీసుకవెళ్లరాదు.

- బస్సు చక్రాలు కొత్తవిగా ఉండాలి. 10 శాతం కన్నా ఎక్కువగా అరుగుదల ఉండవద్దు.

- బస్సుకు అద్దాలు ఉండాలి.. ఎమర్జెన్సీ డోర్‌ తప్పనిసరిగా ఉండాలి.

- సరిపడా మందులతో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉండాలి.

- బస్సు క్లచ్‌, బ్రేక్‌ ఎప్పుడూ సరిచూసుకోవాలి.

- చిన్నపిల్లల బస్సులో 325 సెంటిమీటర్ల పైనా మెట్లు ఉండాలి.

- బస్సుకు సైడ్‌ రెయిలింగ్‌ అవసరం. బస్సులో నిలువు రాడ్లు ఉండాలి, కార్మిక్స్‌ మిర్రర్‌ ఉండాలి. ఈ అద్దంగుండా బస్సులోని పిల్లలను ఎప్పటికప్పుడు డ్రైవర్‌ పరీక్షించాలి.

- బస్సుకు అప్పర్‌లైట్లు ఉండాలి. బస్సును నిలిపినపుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.

- ప్రతి బస్సులో సహాయకుడు ఉండాలి. బస్సులో ప్రయాణించే ఆయా పిల్లల వివరాలు, చిరునామా, మొబైల్‌ నంబర్‌ బస్సు చార్ట్‌లో పొందుపరచాలి.

- విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌తో కలిసి నెలకొకసారి వాహనాన్ని పరిశీలించాలి.

- బస్సు డ్రైవర్‌ పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

- డ్రైవర్‌కు ప్రతి మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్‌, కంటి చూపు పరీక్షలను ఆయా విద్యా సంస్థలు చేయించాలి.

- 60 ఏళ్లు పైబడిన వారిని డ్రైవర్‌గా నియమించవద్దు, వాహన డ్రైవర్‌గా ఐదేళ్ల అనుభవం ఉన్నవారినే తీసుకోవాలి.

- కంటిచూపు, వినికిడి సమస్య ఉన్నవారితో డ్రైవింగ్‌ చేయించవద్దు.

- మద్యం వ్యసనం ఉంటే తొలగించాలి.

ఫిట్‌నెస్‌ లేకుంటే బస్సులు సీజ్‌..

- జి వంశీధర్‌, ఎంవీఐ సిరిసిల్ల

పాఠశాలల యజమాన్యాలు స్కూల్‌ బస్‌ల నిర్వహణలో నిబంధనలు పాటించాలి. బస్సుల ఫిట్‌నెస్‌ తప్పనిసరి చేయించాలి. ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తాం. ఫిట్‌నెస్‌కు వచ్చే ముందు నిబంధనల ప్రకారం బస్సు ఉండేలాగా చూసుకోవాలి. డ్రైవర్లు రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి. ఫిట్‌నెస్‌ లేని బస్సులపై రవాణా శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫిట్‌నెస్‌తో పాటు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలను పొందాలి. డ్రైవర్లకు ఇప్పటికే అవగాహన కూడా కల్పించాం. ఫిట్‌నెస్‌పై విసృత స్థాయిలో తనిఖీలు కూడా చేపడుతాం. 15 సంవత్సరాలు దాటిన బస్సులను, ఇతర అవసరాలకు ఉపయోగించుకున్న వాటిని రిజిస్ర్టేషన్‌లో మార్పులు చేసుకోవాలి.

Updated Date - Jun 11 , 2025 | 01:34 AM