ఉపాధి హామీలో చేపల కొలనులు
ABN, Publish Date - May 19 , 2025 | 12:27 AM
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపల కొలనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోంది. 2005-26 ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ మండలానికి 12 చేపల కొలనుల యూనిట్లు మంజూరయ్యాయి.
కరీంనగర్ రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపల కొలనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తోంది. 2005-26 ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ మండలానికి 12 చేపల కొలనుల యూనిట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, ఫకీర్ పేట, ఇరుకుల్ల, మొగ్దుంపూర్, నగునూర్ గ్రామాల్లో ఆరు చేపల కొలనులు నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఒక్కో కొలను 20 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడెల్పు 2 మీటర్ల లోతుతో నిర్మిస్తున్నారు. ఒక యూనిట్‌లో నాలుగు చేపల కొలనుల చొప్పున తవ్వుతున్నారు. ఒక చేపల కొలను నిర్మాణానికి మొత్తం 2,600 పనిదినాలను కూలీలకు కల్పించాల్సి ఉండగా, సుమారు 8.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఉపాధిహామి అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో కొలనులు తవ్వేందుకు కూలీలు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. చేపల కొలనుల నిర్మాణంతో కూలీలకు పని లభిస్తుంది. వేసవి కాలం పూర్తయ్యేలోగా అన్ని గ్రామాల్లో చేపల కొలనులు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏపీవో శోభరాణి తెలిపారు. ఉపాధిహామీ పథకంలో చేపల కొలనుల నిర్మాణం పూర్తయితే వర్షాలు కురిసిన సమయంలో నీళ్ళు నిల్వ ఉండటంతో చేపలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంబది. ఆయా గ్రామాల్లోని చేపల కొలనుల్లో చేపలను పెంచేందుకు మత్స్యకారులకు డీఆర్‌డీఏ ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు. ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల నుంచి 3లక్షల వరకు రుణంతో చేపల పిల్లల కొనుగోలు, దాణా, నీటి వసతికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Updated Date - May 19 , 2025 | 12:27 AM