ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:16 AM
ప్రస్తుత సీజన్‌లో ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటమరణ సిబ్బందని ఆదేశించారు.
సుభాష్‌నగర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటమరణ సిబ్బందని ఆదేశించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలకు గురువారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వే నిర్వహించి, ఎక్కువగా జ్వరాలు ఉన్నప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం సభ రిపోర్టులను గ్రామాల వారీగా అప్‌డేట్ చేసుకోవాలన్నారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి స్వీయ పరీక్ష చేసుకోవడంపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనజవేరియా మాట్లాడుతూ గర్భిణులకు యాంటీ నేటల్ పరీక్షలు నిర్ణీత సమయం ప్రకారం చేయాలని సూచించారు. నగరంలోని బుట్టి రాజారాం అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ సాజిదా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాజగోపాల్‌రావు, ఎన్‌సీడీ పీవో డాక్టర్ విప్లవశ్రీ, డెమో రాజగోపాల్, డీసీహెచ్‌ఎన్‌వో విమల, డీపీవో స్వామి పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:16 AM