ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:19 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌వీ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలు విచ్చలవిడిగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమ వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండడం వల్ల సీట్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి కుతాటి రాణాప్రతాప్, ఉపాధ్యక్షుడు కెంసారం రవితేజ, అరవింద్, రాకేష్, అస్లాం, సాయి, ఆయాన్, చందు, బాబు, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:19 AM