ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి..
ABN, Publish Date - Jul 06 , 2025 | 12:46 AM
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్య త్తును కాపాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశా రు.
సిరిసిల్ల రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యో తి) : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్య త్తును కాపాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్య దర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశా రు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల నుంచి పెం డింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్‌మెంట్స్‌లతో పాటు స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి నాయకులు నిరసనలు తెలిపారు. ఈ సం దర్భంగా జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లా డుతూ రాష్ట్రంలో ప్రైవేటు కళాశాల యాజ మాన్యాలు ఫీజుల కోసం విద్యార్థలను తీవ్ర ఇబ్బందులకు గురుచేస్తున్నాయని ఆరోపిం చారు. అప్పులు తెచ్చి మేము విద్యాసంస్థ లను నడపలేమని పరీక్షలు బాయ్‌కాట్ చే స్తున్నాయని, మరోపక్క విద్యార్థుల నుంచి పెండింగ్ ఫీజులను బలవంతగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఎలాంటి స్పందన లేకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నా రు. ప్రస్తుతం రాష్ట్రంలో 13లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పైచదువులకు పోవా లంటే సర్టిఫికేట్‌ల కోసం కళాశాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని అన్నారు. కొన్ని కళాశాలలు కూడా విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులను వసూళ్లు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాలని లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఉద్యమాలను చేపడుతామన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్‌కుమార్, జిల్లా బాలిక కన్వీనర్ సంజన, జిల్లా కమిటి సభ్యులు క డారి శివ, నాయకులు జశ్వంత్, సుశాం త్, మహేష్, సంతోష్, దినకర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 06 , 2025 | 12:46 AM