ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:43 AM

రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నగగరంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌ టౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నగగరంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా చట్టం అమలు చేయడకుండా నిర్లక్ష్యంగా వ్వహరిస్తుందని అన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పొడపంగి నాగరాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కెంసారం రవితేజ, సహాయ కార్యదర్శి అరవింద్‌, నాయకులు అస్లాం, రాకేష్‌, అజయ్‌, బాబు, శ్రీనివాస్‌, నవీన్‌, సాయి కుమార్‌, అయాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:43 AM