రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:48 AM
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొద్ది వ్యవధిలోనే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల రైతులకు 20వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. అంతేకాకుండా కేవలం 9 రోజుల వ్యవధిలోనే 9000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతాంగానికి తమ ప్రభుత్వం రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. అంత కుముందు బోయినపల్లి మండల కేంద్రంలో శివాజీ నగర్ హై స్కూల్ స్థానిక బస్టాండ్ వద్దకు వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. రైతు భరోసా కార్యక్రమం విజ యవంతమైన సందర్భంగా రైతులు,మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఏనుగుల కనకయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్, సింగిల్ విండో చైర్మన్లు జోగినపల్లి వెంకటరామా రావు, వేసిరెడ్డి దుర్గారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి మహేశ్వర్‌రెడ్డి, నాగుల వంశీ తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:48 AM