అన్నదాతలకు ఉపయోగకరంగా రైతు వేదికలు
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:32 PM
అన్నదాతలకు ఉపయోగకరంగా రైతు వేదికలను తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో మంగళవారం ఆమె పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు ఉపయోగకరంగా రైతు వేదికలను తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో మంగళవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు వేదికల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తారని తెలిపారు.
ఫ విద్యుత్ సరఫరాకు అంతరాయం
సీఎం ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో గంట సేపు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడంది. దీంతో రైతు భరోసా లైవ్ ప్రోగ్రాం ఆటంకం ఏర్పడింది. అప్రమత్తమైన ట్రాన్స్‌కో అధికారులు గుంటూరు పల్లె వద్ద విద్యుత్ లైన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రణధీర్‌కుమార్, ఎంఏవో బి సత్యం, తహసీల్దార్ రాజేశం, ఏఈవో పైడితల్లి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాంరెడ్డి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ తోట తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ ఊరడి మల్లారెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:32 PM