ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షాలపైనే రైతుల ఆశలు వర్షాలతో ఊరట

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:08 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురుస్తుండడంతో పంటలు సాగు ముందుకు సాగడం లేదు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులకు కొంత ఊరట కలిగినప్పటికీ నీటి వనరులైన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండే స్థాయిలో భారీ వర్షాలు కుర వడం లేదు. ఈ సీజన్‌లో జిల్లాలో ఈ నెల 23న రాత్రి కురిసిన భారీ వర్షమే అత్యధికం. జిల్లా వ్యాప్తంగా 53.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

- ఇప్పుడిప్పుడే కురుస్తున్న వానలు

- సకాలంలో కురవక సాగు ఆలస్యం

- ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా వరద

- సాధారణానికి చేరని వర్షపాతం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురుస్తుండడంతో పంటలు సాగు ముందుకు సాగడం లేదు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులకు కొంత ఊరట కలిగినప్పటికీ నీటి వనరులైన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండే స్థాయిలో భారీ వర్షాలు కుర వడం లేదు. ఈ సీజన్‌లో జిల్లాలో ఈ నెల 23న రాత్రి కురిసిన భారీ వర్షమే అత్యధికం. జిల్లా వ్యాప్తంగా 53.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరిన్ని భారీ వర్షాలు కురిస్తేనే ఈ సీజన్‌లో వ్యవసాయ శాఖా ధికారులు అంచనా వేసిన మేరకు పంటలు సాగు కాను న్నాయి. జిల్లా రైతులు ప్రధానంగా శ్రీరాంసాగర్‌ ప్రా జెక్టు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. డి-83, డి-86 కాలువల ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,73,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జిల్లాలో వానాకాలం సీజన్‌లో అత్యధికంగా వరితోపాటు పత్తి పంటలు, యాసంగి సీజన్‌లో వరి, మొక్కజొన్న, తది తర పంటలను సాగు చేస్తారు. వానాకాలం సీజన్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, వ్యవసాయ బావులు, బోరు బావులు, చెరువులు, కుంటల కింద 2,76,076 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని అంచనా వేశారు. గత ఏడాది వానాకాలంలో 2,72,678 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది అదనంగా 3,368 ఎకరాల్లో సాగు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలనే సాగు చేస్తున్నారు. వానాకాలంలో 2,12,500 ఎకరాల్లో వరి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, 5 ఎకరాల్లో పెసర, 5 ఎకరాల్లో మినుము, 250 ఎకరాల్లో కంది, 10 ఎకరాల్లో వేరుశెనగ, 5 ఎకరాల్లో నువ్వులు, 52,500 ఎకరాల్లో పత్తి, 10,086 ఎకరాల్లో మిర్చి, పసుపు, ఆయిల్‌పామ్‌, కూరగాయల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాలు సకాలంలో కురవక పంటలు ఆలస్యంగా సాగవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 1,03,000 ఎకరాల్లో వరి, పత్తి 43 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారని జిల్లా వ్యవసాయ శాఖాధికారి బి శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో గల చెరువులు, కుంటలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. మత్తడులు దూకడం లేదు. గత ఏడాది ఇదే నెల రెండో వారం నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెలాఖరుకల్లా అన్ని నీటి వనరులు సమృ ద్ధిగా నిండడంతో రెండు పంటలకు సాగు నీరు సమృ ద్ధిగా అంది పంటలకు ఢోకా లేకుండా పోయింది.

ఫ సాధారణానికి చేరని వర్షపాతం..

జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. 374.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపా తానికి గాను 271.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. ఇంకా 27 శాతం లోటు ఉంది. ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల, సుల్తానాబాద్‌ మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదయ్యింది. ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం, రామగిరి, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, మంథని మండలాల్లో ఇంకా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉద యం వరకు జిల్లాలో 25.5 మిల్లీమీటర్ల సగటు వర్షపా తం నమోదయ్యింది. ఈ వర్షాలతో వాగులు పారుతు న్నప్పటికీ, చెరువులు, కుంటలు మత్తడులు దూకడం లేదు.

ఫ ప్రాజెక్టులకు స్వల్పంగా వరద..

జిల్లా రైతులకు జీవనాధారం అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21.369 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి 2.579 క్యూసెక్కుల వరద నీరు వస్తు న్నది. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 24.376 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు 60 టీఎంసీలకు చేరితే తప్ప సాగు నీటిని విడుదల చేయరు. జిల్లాలో వర్షాలు పడక పోయినా, ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.169 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ ప్రాంతం నుంచి ఉదయం 3,665 క్యూసెక్కుల వరద నీరు రాగా, సాయంత్రం వరకు 452 క్యూసెక్కులకు తగ్గింది. దీనికి ఎగువన గల కడెం ప్రాజెక్టు నిండితే తప్ప ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. ప్రాజెక్టు నిండిన తర్వాత వచ్చిన వరద నీటిని వచ్చినట్లే నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరుకు పంపించనున్నారు. రైతులు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:08 AM