రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:32 AM
Farmers can purchase grain without any hassle రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మండలంలోని మల్యాల, ముత్యంపేట, నూకపల్లి, రామన్నపేట గ్రామాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మల్యాల, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మండలంలోని మల్యాల, ముత్యంపేట, నూకపల్లి, రామన్నపేట గ్రామాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో రైతులు సాగునీరు, కొనుగోలు సమయంలో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల పక్షపాతిగా పంట కోతలకు వచ్చే చివరిరోజు వరకు సాగునీరు అందించిందని, సజావుగా కొనుగోళ్లకు పూనుకుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బత్తిని మల్లీశ్వరీశ్రీనివాస్‌గౌడ్, వైస్‌చైర్మన్ జీవన్‌రెడ్డి, విండో చైర్మన్లు రాంలింగారెడ్డి, మధుసూదన్ రావు, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీవో స్వాతి, ఏపీఎం జీసీ రాజయ్య, ఎంపీవో ప్రవీణ్, ఏఎంసీ కార్యదర్శి వరలక్ష్మి నాయకులు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శనిగారపు తిరుపతి, నేరెళ్ల సతీశ్‌రెడ్డి, సంత ప్రకాశ్‌రెడ్డి, బట్టు విజయ్, ప్రతాప్, కట్కం వినయ్, లక్ష్మణాచారి, జలందర్, హరినాఽథ్, నరసింహరెడ్డి, అనిల్ పాల్గొన్నారు.
తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
కొడిమ్యాల (ఆంధ్రజ్యోతి): రైతుల పండించిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్ల్లి సత్యం సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంతో పాటుగా రామకి ష్టాపూర్, చెప్యాల, నాచుపల్లి, పూడూర్ గ్రామా ల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిం చే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రా రంభించారు. మండలంలోని తిర్మాలాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జీవన్ రెడ్డి, సీనియర్ నాయకుడు మహిపాల్‌రెడ్డ్డ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీడీవో స్వరూప, ఏవో జ్యోతి, ఇన్‌చార్జ్ ఏపీఎం పద్మ, ఆర్‌ఐ కరుణాకర్, కొడిమ్యాల, పూడూర్ సింగిల్‌విండోల చైర్మనులు రాజనర్సిం గరావు, రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండోల ఉపాధ్యక్షు లు కవితచంద్రమోహన్‌రెడ్డి, రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణగౌడ్, నా యకులు మహిపాల్‌రెడ్డ్డి, ప్రసాద్, ప్రభాకర్‌రెడ్డ్డి, అయిలయ్య, మల్లేశంయాదవ్, సింగిల్ విండోల కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:32 AM