ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలి
ABN, Publish Date - May 31 , 2025 | 12:36 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లా ఆసుపత్రిలో టుడీ ఎకో పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరా లు అందుబాటులో పెట్టామని, వీటిని వినియోగించాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్‌లో అన్నిరకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, శాంపిల్స్ సేకరణ, రిపోర్టు వేగం గా అందించాలన్నారు. ప్రభుత్వ అసుపత్రుల్లో అవసరమైన వైద్యులు, టెక్నీషీయన్‌లు, తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కువ వేతనం అందించి నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇతర ఆసుపత్రుల్లో అందుబా టులో ఉన్న స్టాఫ్ అవసరం మేరకు డిప్యూటేషన్ చేయాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షిస్తూ త్వరగా పనులు పూర్తిచేయాలని, ఆసుపత్రి ప్రాంగణం లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మెడికల్ వేస్ట్ డిస్పోజల్ నిబంధనల ప్రకారం నిత్యం జరగాలన్నారు. సదరం క్యాంపు పెండింగ్‌లో ఉంచకుండా నిరంతరం శిబిరాలు నిర్వహిస్తూ దివ్యాంగులకు యూవీఐడీ కార్డులు జారీ చేయాలని అన్నారు. వేములవాడ ఆసుపత్రిలో మోకాళ్ల అపరేషన్‌లు విజయవంతంగా జరుగుతున్నాయని సిరిసిల్ల ఆసుపత్రిలో కూడా ఆపరేషన్లు జరగాలని అన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గలవారిని గుర్తించి వారికి పరీక్షల నిర్వహణ చర్యలు తీసుకోవాలని అన్నారు. టీబీ వ్యాధిగ్రస్థులకు అవసరమైన చికిత్స పక్కాగా అందాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత, మెడికల్ కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 12:36 AM