ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ ఆధార్‌కు కసరత్తు

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:45 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరిన్ని సేవలు అందించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సాగుదారుల లెక్క పక్కాగా ఉండే విధంగా ఆధార్‌ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన భూఆధార్‌(ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు) అందించాలని నిర్ణయించింది.

- వ్యవసాయ భూములకు దేశవ్యాప్త గుర్తింపు

- కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించనున్న ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు

- వ్యవసాయ సిబ్బందికి శిక్షణ... అందుబాటులోకి వచ్చిన యాప్‌

- గ్రామాల్లో రైతు వేదికల వద్ద వివరాల నమోదు

- జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు

- జిల్లాలో 1,10,283 మంది రైతులకు కార్డులు

- 22 నుంచి కార్డులు అందించే ప్రక్రియ షురూ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరిన్ని సేవలు అందించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సాగుదారుల లెక్క పక్కాగా ఉండే విధంగా ఆధార్‌ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన భూఆధార్‌(ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు) అందించాలని నిర్ణయించింది. ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ పేరుతో ప్రతి రైతులకు 11అంకెల విశిష్ట సంఖ్యలో కార్డులు జారీ కానున్నాయి. వ్యవసాయ రంగంలో సంక్షేమ పథకాలు లబ్ధికి ప్రామాణికంగా ఉండే విధంగా పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకు భూ ఆధార్‌ కార్డులను అందించనున్నారు. ప్రతి రైతు కార్డును పొందాల్సిన అవసరం ఉంది. ఈనెల 22 నుంచి కేంద్ర ప్రభుత్వం కార్డులు అందించే దిశగా చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు 1.10 లక్షల మంది రైతులు అందుకోనున్నారు.

ఫ రైతు వేదికల ద్వారా ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ

వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లకు ఒకసారి గణాంకాలు చేపడుతూ వ్యవసాయ పరిస్థితులను అంచనాలు వేసి కొత్త విధానాలను రూపకల్పన చేస్తుంది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రైతులకు గుర్తింపు ఇచ్చే విధంగా ఈనెల 22 నుంచి ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతు వేదికల ద్వారా అందించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డుల జారీ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని భూ యజమానులతో పాటు కౌలు రైతులకు సైతం జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ - అగ్రి స్టాక్‌ ప్రాజెక్ట్‌ పేరిట అమలుచేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటుచేశారు. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా కార్డులను అందిస్తారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57రైతు వేదికలు ఉన్నాయి. రుద్రంగి మండలంలో రెండు, చందుర్తిలో 5, వేములవాడ రూరల్‌లో 3, బోయినపల్లిలో 4, వేములవాడలో 2, సిరిసిల్లలో 2, కోనరావుపేటలో 6, వీర్నపల్లిలో 2, ఎల్లారెడ్డిపేటలో 5, గంభీరావుపేట 6, ముస్తాబాద్‌లో 5 తంగళ్లపల్లిలో 6, ఇల్లంతకుంటలో 7 రైతు వేదికలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి రైతుల వివరాలను నమోదు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. రైతులు మండల విస్తరణ అధికారులు, లేదా వ్యవసాయ అధికారులు నమోదు చేస్తారు. రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ను సిబ్బందికి తెలియజేస్తే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు నంబర్‌ వస్తుంది. రైతులకు అందించే కార్డు ద్వారా భూ కమతాలకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. భూ యజమాని వివరాలు, విస్తీర్ణం, వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను నివారించడానికి సహాయపడుతుంది. భూములను బ్యాంకింగ్‌ బీమా సంస్థలతో తేలిగ్గా అనుసంధానం చేయవచ్చు. అన్ని సంక్షేమ పథకాలకు యూనిక్‌ కోడ్‌ తప్పనిసరి కానుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుగా కూడా వాడుకోవచ్చు.

ఫ ఆధార్‌ అనుసంధానం..

భూ ఆధార్‌ కార్డు జారీకి రైతు విశిష్ట సంఖ్యను పొందేందుకు ఆధార్‌ కార్డుతో పాటు మొబైల్‌ నంబర్‌, పట్టాదారు పాసు పుస్తకం అనుసంధానం చేస్తారు. క్లస్టర్‌ పరిధిలోని వ్యవసాయ అధికారులు రైతులకు గుర్తింపు సంఖ్యలను కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితర పథకాలకు కార్డుతో సంబంధం ఉండదు. కేంద్ర పథకాలకు మాత్రమే ప్రామాణికంగా తీసుకోనున్నారు. రైతులకు అందించే ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డుల జారీ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతు వేదిక, వేములవాడ మండలం మారుపాక రైతు వేదికలో శిక్షణను అందించారు. వ్యవసాయ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.

ఫ జిల్లాలో 1.10 లక్షల మంది రైతులకు..

దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉండే విధంగా అందించే ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ (భూ ఆధార్‌) కార్డులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.10 లక్షల మంది రైతులు అందుకోనున్నారు. జిల్లాలోని 13 మండలాలు, 171 రెవెన్యూ గ్రామాలు, 260 గ్రామ పంచాయతీల పరిధిలో 83 వేల హెక్టార్‌లలో భూకమతాలు ఉన్నాయి. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా, 2.47 ఎకరాకలకు సంబంధించి 81,416 ఎకరాలు 75,931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధించి 25,092 మంది రైతుల వద్ద 86,460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8,346 మంది రైతుల వద్ద 53,560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1,427 మంది రైతుల వద్ద 18,962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2,756 ఎకరాల భూములు ఉన్నాయి. వీటికి సంబంధించిన రైతులు జిల్లాలో రైతు వేదికల వద్ద వివరాలు నమోదు చేసుకోని కార్డులు పొందనున్నారు.

ఫ రైతులందరూ ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు పొందాలి

- అఫ్జల్‌ బేగం, జిల్లా వ్యవసాయ అధికారి

కేంద్ర ప్రభుత్వం జారీచేయనున్న ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డుల జారీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులందరూ ఈ-ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్డులు పొందాలి. ఈనెల 22 నుంచి రైతు వేదికల ద్వారా వివరాల నమోదు, కార్డుల జారీ మొదలవుతుంది. కార్డుల జారీ కోసం వ్యవసాయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. రైతులు తమ ఆధార్‌ కార్డు, పట్టాదార్‌ పాసుపుస్తకం, మొబైల్‌ నంబర్‌తో వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లోనూ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

Updated Date - Apr 19 , 2025 | 12:45 AM