ఎస్సారార్ కామర్స్ సదస్సు అంతర్జాతీయ జర్నల్ విడుదల
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:05 AM
ఎస్సారార్ ప్రభుత్వ అటానమస్ కళాశాల కామర్స్ విభాగం ప్రచురించిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అనే రెండు ప్రత్యేక సంచికలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ ్సలోని అస్త్ర కన్వెన్షన్‌లో విడుదల చేశారు.
గణేశ్‌నగర్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఎస్సారార్ ప్రభుత్వ అటానమస్ కళాశాల కామర్స్ విభాగం ప్రచురించిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అనే రెండు ప్రత్యేక సంచికలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ ్సలోని అస్త్ర కన్వెన్షన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాపార, వాణిజ్య రంగాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిపై పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, కలెక్టర్ పమేల సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నితిన్, టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:05 AM