ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అందరి భాగస్వామ్యంతోనే మలేరియా నిర్మూలన

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:43 AM

మలేరియా నిర్మూలన అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతోందని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మలేరియా నిర్మూలన అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతోందని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. గతయే డాది జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఆ దిశగా అధి కారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచ మ లేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మలేరియా నిర్మూలన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మలేరియారహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. మురుగునీటి కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌, ఆయిల్‌ బాల్స్‌ వేయాలని అన్నారు. దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటు లో ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది మలేరి యా లక్షణాలు ఉన్న రోగులకు పరీక్షలు నిర్వహించి సరైన వైద్యం అందించాలని అన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగాం అధికారి అనిత, సీహెచ్‌సీ ఇన్‌చార్జి సూపరిండెంట్‌ ప్రదీప్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి సరియా అంజు మ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:43 AM