ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పశువుల పెంపకానికి ప్రోత్సాహం

ABN, Publish Date - May 17 , 2025 | 01:16 AM

రోజురోజుకూ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

-ఎన్‌ఎల్‌ఎం కింద రాయితీపై రుణాలు మంజూరు

-ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల ఆహ్వానం

-అవగాహన లేమితో నామమాత్రపు స్పందన

జగిత్యాల, మే 16 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పశువులతో పాటు మేత, దాణ లభ్యతను పెంచేందుకు జాతీయ పశు సంపద మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా రుణ అవకాశం కల్పిస్తోంది. పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌(ఎన్‌ఎల్‌ఎం) ద్వారా రుణాలను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలు, పొటేళ్లు, నాటు కోళ్లు, పుంజులతో పాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకాన్ని పశు సంవర్థక శాఖ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువుల పెంపకానికి ఆసక్తి ఉన్న వారికి సబ్సిడీపై రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తోంది.

ఫరూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ

ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడికి విడతల వారీగా సబ్సిడీ అందించనున్నారు. యూనిట్‌ నెలకొల్పిన తర్వాత సబ్సిడీ వచ్చే వరకు రాష్ట్ర పశు సంవర్థక శాఖ పర్యవేక్షిస్తుంది. యూనిట్‌ స్థాపించేందుకు ఆసక్తి ఉన్న వారు సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు ఉండదు. దరఖాస్తుదారుడు ఫొటో, అడ్రస్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తదితర పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఫస్వల్ప సంఖ్యలో లబ్ధిదారులు..

కేంద్ర ప్రభుత్వం పశువుల పెంపకానికి ప్రోత్సాహకంగా ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి సబ్సిడీ అందిస్తుంది. పథకాన్ని ప్రారంభించి రెండు, మూడేళ్లు గడుస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది లబ్ధి పొందడం లేదు. జిల్లా వ్యాప్తంగా పథకం లబ్ధిదారులు స్వల్ప సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా రెండు సంవత్సరాలుగా ఈ పథకం కింద 246 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 38 యూనిట్లు గ్రౌండింగ్‌ అయినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు అంటున్నారు. అయితే మంజూరు లభించిన తర్వాత 9 నెలల లోపు యూనిట్‌ నెలకొల్పితేనే బ్యాక్‌ ఎండ్‌ సబ్సిడీ జమ అవుతుందంటున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

-డాక్టర్‌ వేణుగోపాల్‌, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి

ఎన్‌ఎల్‌ఎం పథకానికి ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత విచారణ చేపట్టి రుణం మంజూరు చేస్తారు. అలాగే పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుంది. దీని ద్వారా రైతులు లబ్ధిపొందడంతో పాటు వారి జీవనాభివృద్ధికి ఉపయోగపడుతుంది.

రాయితీ వివరాలు..(రూ.లలో)

---------------------------------------------------------------------------------------------------------------------

మేకలు..

గొర్రెలు+పొట్టేలు......యూనిట్‌ విలువ..........సబ్సిడీ................రైతు వాటా..............బ్యాంకు రుణం

500+25..................రూ.కోటి...................రూ.50 లక్షలు......రూ.10 లక్షలు............రూ.40 లక్షలు

400+20..................రూ.80 లక్షలు........రూ.40 లక్షలు......రూ.8 లక్షలు.............రూ.32 లక్షలు

300+15..................రూ.60 లక్షలు........రూ.30 లక్షలు......రూ.6 లక్షలు.............రూ.24 లక్షలు

200+15..................రూ.40 లక్షలు........రూ.20 లక్షలు......రూ.4 లక్షలు.............రూ.16 లక్షలు

100+5....................రూ.20 లక్షలు........రూ.10 లక్షలు......రూ.2 లక్షలు.............రూ.8 లక్షలు

---------------------------------------------------------------------------------------------------------------------

పందులు....

మగ+ఆడ.................యూనిట్‌ విలువ......సబ్సిడీ........................ రైతు వాటా...............బ్యాంకు రుణం

100+10....................రూ.80 లక్షలు..........రూ.40 లక్షలు......రూ.8 లక్షలు.............రూ.32 లక్షలు

50+5........................రూ.15 లక్షలు........రూ.7.5 లక్షలు......రూ.1.5 లక్షలు.............రూ.6 లక్షలు

---------------------------------------------------------------------------------------------------------------------

కోడి+పుంజు.................యూనిట్‌ విలువ......సబ్సిడీ........................ రైతు వాటా...............బ్యాంకు రుణం

1000+100....................రూ.50 లక్షలు..........రూ.25 లక్షలు......రూ.5 లక్షలు.............రూ.20 లక్షలు

---------------------------------------------------------------------------------------------------------------------

దాణా గడ్డి...................రూ.కోటి........................రూ.50 లక్షలు......రూ.10 లక్షలు...........రూ.40 లక్షలు

---------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 17 , 2025 | 01:16 AM