‘స్థానిక’ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:53 AM
త్వరలో జరగ నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కోరారు.
సిరిసిల్ల రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగ నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో అదివారం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, వేములవాడ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి చెన్నమనేని వికాష్ రావుల అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావే శాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ రైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీ చేసేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉండా లన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాదు గ్రామీణ ప్రాంత వాసులకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అభివృద్ది మంత్రాన్ని చేపడుతుందన్నారు. గ్రామాల్లో వార్డు అభ్యర్థుల స్థాయి నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ స్ధాయిలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాలని వారి గెలుపుకోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్ల కృషి చేయాలన్నారు. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ది పనులపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, రాష్ట్ర కౌన్సిల్‌సభ్యులు మ్యాన రాంప్రసాద్, కరీంనగర్ పార్లమెంటరీ కోకన్వీర్‌లు అడెపు రవీందర్, దశరధం రెడ్డి, జిల్లాప్రఽధాన కార్యదర్ళి రేగుల మల్లిఖార్జున్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల కన్వీనర్‌లు మల్లారెడ్డి, మరుత సత్తయ్య, స్ధానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పోన్నాల తిరుపతిరెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 12:53 AM