ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:35 AM

గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

రంగాపూర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావు

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి రూరల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రంగాపూర్‌ గ్రామంలో ఈజీఎస్‌ 15 లక్షలు, డీఎంఎఫ్‌టీ 10 లక్షలు, ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ 10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకా లు అమలుతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తా మన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఎనగందుల ప్రదీప్‌, గంట రమేష్‌,, చంద శంకర్‌, ఆరె సంతోష్‌, ఆడెపు వెంకటేషం, కలవేణ నరేంద ర్‌, అశోక్‌, సారయ్య గౌడ్‌, సతీష్‌, కార్తీక్‌, శంకర్‌, సతీష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

దసరాలోపు బస్సు డిపో ప్రారంభం

కాల్వశ్రీరాంపూర్‌ (ఆంధ్రజ్యోతి): దసరాలోపు పెద్దపల్లిలో బస్సు డిపో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపా రు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్‌డీ ఎఫ్‌ ఐదు లక్షల నిఽధులతో నిర్మించి న రెడ్డి సంఘ భవనాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రాక ప్రయాణికు లు ఇబ్బంది పడుతున్న విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, బస్సు డిపోను మంజూరు చేశారన్నారు. బస్సు డిపో ప్రారంభం కాగానే కాల్వశ్రీరాంపూర్‌ నుంచి హైద రాబాద్‌కు బస్సును ప్రారంభి స్తామ న్నారు. కాల్వశ్రీరాం పూర్‌, పొత్కపల్లి రోడ్డుకు 25కోట్లతో పనులు జరుగుతు న్నాయన్నారు. ఓదెల మండ లంలో పేట నుంచి జమ్మికుం టకు వెళ్లే దారిలో 80కోట్లతో మానేరులో బ్రిడ్జి నిర్మిస్తామని, దీంతో రైతులకు, ప్రయాణికు లకు జమ్మికుంట దగ్గరవుతుం దన్నారు. రెడ్డి సంఘ భవన నిర్మాణానికి ప్రత్యేక కృషిచేసిన పెద్దిరెడ్డి వీరారెడ్డిని ఎమ్మెల్యే అభినం దించారు. కార్యక్రమంలో రెడ్డిసంఘం మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి వీరారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, మాజీ వైస్‌ చైర్మన్‌ జూకంటి శిరీష తదితరులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

ఎలిగేడు/జూలపల్లి (ఆంధ్రజ్యోతి): ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం చొప్పదండి మండలంలోని రెవెల్లే ఎస్సారెస్పీ మెయిన్‌ కాలువ నీటిని ఎస్సారెస్పీ ఉన్నతధికారు లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో నీటి సాంద్రత అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం తన స్వగృహంలో విలేక రులతో మాట్లాడారు. రైతుల పంట పొలాలను ఎండనివ్వమని భరోసా ఇచ్చారు. చొప్పదండి మం డలం మీదుగా ఉన్న రెవెల్లే కెనాల్‌ను పరిశీలించి ఇరిగేషన్‌ అధికారులతో చర్చించినట్లు ఆయన పే ర్కొన్నారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు రైతుల పంటపొలాలకు సాగునీరు అందించాలని అఽధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అనంతరం కెనాల్‌నీటి పారుద లకు సంబంధించిన లాగ్‌ పుస్తకాలను పరిశీలించి నీటిపారుదలశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి దుగ్యాల సంతోష్‌ రావు, ఇరిగేషన్‌ ఎస్‌సీ శరత్‌చంద్ర, ఈఈ ప్రసాద్‌, డీఈ కుమార్‌, బొజ్జ శ్రీనివా స్‌, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 12:35 AM