సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ కేసులు ఎత్తివేయాలి
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:42 AM
ఏఐసీసీ మాజీ అధ్యక్షు లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు త్వం అక్రమంగా పెట్టించిన ఈడీ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిరిసిల్ల పట్టణం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాల యం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ మాజీ అధ్యక్షు లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభు త్వం అక్రమంగా పెట్టించిన ఈడీ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిరిసిల్ల పట్టణం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాల యం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ర్యాలీగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు చేరుకొని గేటు ముందు బైఠా యించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కో ఆర్డినేటర్ అవేజ్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో నరేంద్రమోదీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలను ఆపాల ని ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కుట్ర పూరితంగా ఈడీ కేసులను పెడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన రాజ్యాంగ పరిర క్షణ పాదయాత్రలు ఆగవని హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నాయకులను బలవంతంగా ధర్నాను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్య క్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండీ ఖాజా, వెంకటేశం, కాసర్ల రాజు, మాజీ కౌన్సిలర్ కుడికాల రవీందర్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:44 AM