ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువతకు ‘ఆర్థిక’ వికాసం

ABN, Publish Date - Jun 01 , 2025 | 01:00 AM

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా నిరుపేద, మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. యువత నుంచి దరఖాస్తులు అహ్వానించి లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపట్టింది.

రాజీవ్‌ యువవికాసం దరఖాస్తులు పరిశీలిస్తున్న అఽధికారులు (ఫైల్‌)

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 36,819 దరఖాస్తులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా నిరుపేద, మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. యువత నుంచి దరఖాస్తులు అహ్వానించి లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపట్టింది. రాజీవ్‌ యువ వికాసంతో ఉపాధిపై అశలు పెట్టుకున్న నిరుద్యోగులకు సిబిల్‌ స్కోర్‌ అడ్డుగా మారింది. డిప్యూటీ సీఎం రాజీవ్‌ యువ వికాసానిని సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదని ప్రకటనలు చేసినా ప్రభుత్వ మార్గదర్శకాలు బ్యాంకర్లకు చేరకపోవడంతో సిబిల్‌ స్కోర్‌ చిక్కుముడి అలాగే ఉండిపోయింది. బ్యాంక ర్లు ఎటువంటి రుణాలు ఇవ్వాలన్న మొదట సిబిల్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు బ్యాంక్‌లకు వెళ్లిన తరువాత సిబిల్‌ స్కోర్‌ యువతకు నిరాశ మిగిలి స్తుంది. అధార్‌, సెల్‌ నెంబర్‌లు జత చేయడంతో రుణాల పక్రియ కొంత అయోమయంగానే మారిం ది. అర్హులైన వారికి ఆర్థిక వికాసంగా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అందించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను 1:2 నిష్పత్తిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. రాజీవ్‌ యువ వికాసంలో తొలి విడతగా దరఖాస్తుల స్వీకరణ పరిశీలన పూర్త యిన వాటిలో జూన్‌ 2 తెలంగాణ అవిర్భావ దినో త్సవం రోజు లబ్ధిదారులకు అందించే విధంగా కసరత్తు మొదలు పెట్టారు.

జిల్లాలో 7,680 యూనిట్లు... 7,121 మంది అర్హులు

జిల్లాలో రాజీవ్‌ యువ వికాసం పథకానికి 36,819 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌కు 8,865 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌కు 1943, బీసీ కార్పొరేషన్‌కు 23,243 మైనార్టీ కార్పొరేషన్‌కు 1,606, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు 39, ఈబీసీ దరఖాస్తులు 1123 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో పరిశీలిం చారు. జిల్లాలో 7,680 యూనిట్లకు రుణాల పంపిణీ లక్ష్యం కాగా 7121 మంది అర్హులను ఎంపిక చేశా రు. రూ.50 వేల వరకు 2464 యూనిట్లకు 2148 మంది అర్హులుగా గుర్తించారు. రూ 50 వేల నుంచి లక్ష వరకు 1876 యూనిట్లకు 1771 మంది అర్హు లు, రూ లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 1642 యూనిట్లకు 1587 మంది అర్హులుగా రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు 372 యూనిట్లుకు 372 మంది అర్హులు, రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 941 యూనిట్లకు 924 మంది అర్హులు, రూ. 3 లక్ష లనుంచి రూ. 4 లక్షల వరకు 308 యూనిట్లకు గాను 308 మంది అర్హులు 43 బోర్‌వెల్‌ యూ నిట్లకు 8 మంది అర్హులు. ఎనర్జీ ఓఆర్‌సీ 32 యూ నిట్లకు ఇద్దరు అర్హులు, సోలార్‌ ప్యానెల్‌ ఫర్‌ బోర్‌వెల్‌కు 2 యూనిట్లకు ఒక్కరు అర్హులుగా గుర్తించారు.

యువతకు ఆర్థిక చేయూత

రాజీవ్‌ యువ వికాసంతో యువతకు ఆర్థిక చేయూత లభించనుంది. ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన కులాల వారీగా రాజీవ్‌ యువ వికాసానికి యూనిట్‌లను ప్రభుత్వం కేటా యించింది. ఈ యూనిట్‌లు ఎవరికి అందుతాయనే అసక్తి నెలకొంది. పథకంలో రూ. 50 వేలు, రూ లక్ష, రూ 2 లక్షల నుంచి రూ 4 లక్షల రుణాలు అం దిస్తుండగా రూ. 50 వేల వరకు వంద శాతం సబ్సిడీ రాయితీ, రూ 50 నుంచి రూ లక్ష వరకు 90 శాతం సబ్సిడీ రాయితీ కాగా పది శాతం లబ్ధిదా రుడు చెల్లించాల్సి ఉంటుంది. రూ. లక్ష నుంచి రూ 2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 20 శాతం రుణం, రూ. 2 నుంచి 4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ 30 శాతం రుణంగా అందించనున్నారు. ప్రభుత్వం అందించే యూనిట్లలో పౌల్ర్టీ, బ్యాగుల తయారీ, కొబ్బరిబొండాల దుకాణాలు, బ్యాంగిల్‌ స్టోర్‌, డెయిరీ ఫాం, ఎలక్ర్టికల్‌, మినీ సూపర్‌ బజా ర్‌, స్పింకర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌, గొర్రెలు, సెలూన్‌, బ్యూటీ పార్లర్‌, హార్డ్‌వేర్‌, మెడికల్‌ దుకాణాలు ఇల పలు యూనిట్లను నిర్ణయించారు.

Updated Date - Jun 01 , 2025 | 01:00 AM