ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అల్గునూరు సీవోఈని తరలించవద్దు

ABN, First Publish Date - 2025-05-28T23:37:50+05:30

అల్గునూరులో ఉన్న స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)ని తరలించవద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెల్లి అరవింద్‌, గజ్జల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు.

సుభాష్‌నగర్‌, మే 28 (ఆంరఽఽఽధజ్యోతి): అల్గునూరులో ఉన్న స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీవోఈ)ని తరలించవద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెల్లి అరవింద్‌, గజ్జల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. సీవోఈ తరలించడాన్ని, బైపీసీ కోర్సును ఎత్తివేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట బుదవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. అల్గునూరు సీవోఈని తరలించడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కరీంనగర్‌లో చదువుతున్న విద్యార్థులను హైదరాబాద్‌ గౌలిదొడ్డికి పంపిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. గురుకులాలకు సంబందించిన సమస్యలను సంబంధిత కార్యదర్శి అలుగు వర్షినికి తెలుపుదామంటే ఆమె అపాయిమెంట్‌ కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేయడం శోచనీయమన్నారు. సీవోఈని, బైపీసీ కోర్సును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌, గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఇళ్లను ముట్టిడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్‌, సహాయ కార్యదర్శి ఆకాష్‌, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్‌, సన్ని, వరుణ్‌, మనోజ్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T23:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising