ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ నాయకుల మాటలను నమ్మవద్దు

ABN, Publish Date - Jun 25 , 2025 | 12:29 AM

కాంగ్రెస్‌ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.

ఇల్లంతకుంట, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని పార్టీకార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల ముందు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ఏఒక్క హమీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ అమలు చేస్తున్న స్కీమ్‌లన్ని స్కామేలే అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ముగ్గులు, రైతుబరోసాల పేరిట సంబరాలు జరుపుతున్నారు తప్ప ఏఒక్కరికి న్యాయం జరుగులేదన్నారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈనెల 26న మానకొండూర్‌ మండలకేంద్రంలో మహాదర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల నాయకులు హజరై దర్నాను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నాయకులు ఓట్లకోసం వస్తే తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈసందర్భంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఫ్యాక్స్‌ ఇంచార్జ్‌ చైర్మన్‌ గొడుగు తిరుపతిని అభినందించారు. ఇల్లంతకుంటలో నల్ల శ్రీనివాస్‌ మెడికల్‌షాప్‌ను ప్రారంభించారు. సమావేశంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్‌ సిద్దం వేణు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ్మరెడ్డి, ఫ్యాక్స్‌ ఇంచార్జ్‌ చైర్మన్‌ గొడుగు తిరుపతి,నాయకులు చెరుకు రాజిరెడ్డి, పర్శరాం, కేవీఎన్‌రెడ్డి, మీసరగండ్ల అనీల్‌కుమార్‌, పర్శరాం, చందన్‌, భాస్కర్‌, కొమురయ్య, మల్యాల రాజశేఖర్‌, నీలం అంజయ్య, దమ్మని మధు, ప్రేమ్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:29 AM