2న లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయాలి
ABN, Publish Date - May 29 , 2025 | 12:22 AM
రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్లు ఏర్పాటుచేసి జూన్ 2న లబ్ధిదారులకు ఎంపిక పత్రాలను అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ మే 28 (ఆంధ్రజ్యోతి) : రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్లు ఏర్పాటుచేసి జూన్ 2న లబ్ధిదారులకు ఎంపిక పత్రాలను అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాజీవ్ యువ వికా సం అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి కలెక్టర్ సందీ ప్ కుమార్ ఝాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తోందన్నారు. యువ వికాసం పథ కం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారంచేసి లబ్ధి పొందాలని, రూ 8 వేల కోట్ల రూపాయలతో దాదాపు 5 లక్షల మంది యువతను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నామని, ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడి ఎలా పనిచేస్తుందో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని, రాష్ట్ర జడీపీ వృద్ధిలో ఈ పథకం భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పనితీరు పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మే 29, 30 తేదీలలో జరిగే ఇన్‌చార్జి మంత్రుల సమావేశాలలో రాజీవ్ యువ వికాసంపై చర్చించి తుది జాబితా ఆమోదం చేయాలన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందులో యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపి ణీ చేయాలన్నారు. బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్దిదారుల ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి బిసి వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్ మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతి ఈ డి ఎస్సి కార్పొరేషన్ స్వప్న ఎల్.డి.ఎం. మల్లికార్జున్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:08 PM