ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిలావస్థకు చేరిన ఇళ్లను ఖాళీ చేయించాలి

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:16 AM

వర్షాలు కురుస్తున్నందున శిథిలావస్థలో చేరిన ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. సోమవారం సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాలు కురుస్తున్నందున శిథిలావస్థలో చేరిన ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. సోమవారం సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలతో డ్రైనేజీలు నిండిపోకకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు వాతావరణ, వర్ష సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిరంతరం క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేయాలని అన్నారు. అన్నిరకాల ముందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డెంగీ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. వానాకాలం సాగులో భాగంగా యూరియా కొరత రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించారు. యూరియా అమ్మకాల కేంద్రాల్లో స్టాక్‌ నిల్వలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నామని, ఇందుకు మండలాల వారీగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:16 AM