ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యం..

ABN, Publish Date - May 07 , 2025 | 01:27 AM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగు తున్నది. పథకాన్ని ఆరంభించి మూడు మాసాలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగు తున్నది. పథకాన్ని ఆరంభించి మూడు మాసాలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని అర్హులైన వారు ఎదురు చూస్తున్నారు. మండలానికి ఒక గ్రామంలో ఇళ్లు మంజూరు చేసింది కానీ మిగతా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు మంజూరు చేయక పోవ డంతో అనేక మంది అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసేం దుకు మంచి ముహూర్తాలు పోతున్నాయని అర్హులు ఆందోళన చెందుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్ల పథకాన్ని తీసుక రాగా, అది ఆశించిన మేరకు ముందుకు సాగ లేదు. దీంతో అనేక మంది పేదల సొంతింటి కల నెరవేరలేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని తీసుక వస్తామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 5 లక్షల రూపాయలు అంద జేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించింది. ఈ ఇళ్లను సొంత ఇంటి స్థలం ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. గ్రామసభల్లో ఇంది రమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 1,85,404 దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను, ప్రత్యేకించి ఇందిరమ్మ యాప్‌ను రూపొందించింది. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో గ్రామాల్లో, మున్సిపాలి టీల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. ఫొటోలు తీసి, వారి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్‌ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆరంభించింది. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలకు ఎంత మంది అర్హులు ఉన్నారో వారందరికీ ఆ పథకాలను వర్తింపజేసింది.

ఫ ఎంపిక చేసిన గ్రామాలకు 1957 ఇళ్లు మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూరల్‌ మండలాల్లో 13 గ్రామాలను ఎంపిక చేశారు. ఎలిగేడు మండలం శివపల్లికి 108 ఇళ్లు, జూలపల్లి మండలం కోనరావు పేటకు 144, ఓదెల మండలం శానగొండకు 217 ఇళ్లు, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి 153, కాల్వశ్రీరాంపూర్‌ మండలం అంకంపల్లి 114, సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లికి 167, అంతర్గాం మండలం మద్దిర్యాలకు 59, పాలకుర్తి మండలం రామారావుపల్లికి 124, మంథని మండలం అడవి సోమన్‌పల్లికి 228, ముత్తా రం మండలం మచ్చుపేటకు 40, కమాన్‌పూర్‌ మండ లం రొంపికుంటకు 208, రామగిరి మండలం రత్నా పూర్‌ 323 ఇళ్లు, ధర్మారం మండలం బంజేరుపల్లికి 72 ఇళ్లు, మొత్తం 1957 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 702 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోయగా, 219 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌లో ఉన్నాయి. ఇంకా 1238 ఇళ్లకు ముగ్గులు పోయాల్సి ఉంది. ఈ నిర్మాణాలు కూడా ముందుకు సాగడం లేదు.

ఫ మిగతా గ్రామాలు, పట్టణాల్లో ఎంపికలో జాప్యం

జిల్లాలో ఎంపిక చేసిన 13 గ్రామాలు మినహా గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపిక ముందుకు సాగడం లేదు. జనవరి 23 నుంచి 25 వరకు నిర్వ హించిన గ్రామ, పట్టణ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారి పేర్లను ప్రకటించారు. వారంతా తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 903 ఇళ్లు మంజూరు చేయగా, ఇంకా 2,599 ఇళ్లు, రామగుండం నియోజకవర్గంలో 183 ఇళ్లు మంజూరు చేయగా ఇంకా 3,317 ఇళ్లు, మంథని నియోజకవర్గ పరిధిలో 799 ఇళ్లు మంజూరు చేయగా, ఇంకా వెయ్యి ఇళ్ల వరకు మంజూరు చేయాల్సి ఉంది. లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేస్తున్నారు. అర్హులైన జాబితాలో ఏ ఊరికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలి, ఏ పట్టణానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలనే విషయమై ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే, ఆ జాబితాపై మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తుది జాబితాను జిల్లా ఇన్‌చార్జీ మంత్రికి పంపిస్తారు. ఆయన దానిపై ఆమోద ముద్ర వేసిన తర్వాత కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు మరింత సమయం పట్టనున్నది. పథకం ఆరంభమై మూడు మాసాలు గడుస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయడంలో ఇందిరమ్మ కమిటీలు, ఎమ్మెల్యేలు తీవ్ర జాప్యాన్ని కనబరుస్తున్నారు. స్థానిక నాయకుల సూచ నల మేరకు ఇళ్లు మంజూరయ్యే అవకాశాలు కనబడు తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ఇళ్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని అర్హులు కోరుతున్నారు.

Updated Date - May 07 , 2025 | 01:27 AM