ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుద్యోగులకు వరం ‘డీట్‌’

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:11 AM

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ) యాప్‌ను ప్రవేశపెట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం నిరుద్యోగులకు నమ్మకమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఈ యాప్‌తో యువత బోగస్‌ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

- ప్రత్యేక యాప్‌ రూపొందించిన ప్రభుత్వం

- నమోదు చేసుకుంటే ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగాల సమాచారం

- నిరక్షరాస్యుల నుంచి పీహెచ్‌డీ చేసిన అందరూ అర్హులు

- ఎప్పటికప్పుడు ఫోన్లకు నోటిఫికేషన్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ) యాప్‌ను ప్రవేశపెట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం నిరుద్యోగులకు నమ్మకమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఈ యాప్‌తో యువత బోగస్‌ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

ఫ ఖాళీల సమాచారం...

డీట్‌ యాప్‌ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు తమ ఖాళీల వివరాలను నేరుగా నిరుద్యోగుల మొబైల్‌ ఫోన్లకు పంపిస్తాయి. ఈ సమాచారంలో ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వేతనాల వివరాలు, ఖాళీల సంఖ్య, మౌఖిక లేదా రాత పరీక్షల వివరాలు ఉంటాయి. ఈ విధంగా సమగ్ర సమాచారం అందిన నిరుద్యోగులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. యాప్‌నకు కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను అనుసంధానం చేశారు. దీంతో ఇది మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలను అందిస్తోంది.

ఫ జిల్లాస్థాయిలో 135 కంపెనీలు

ఇప్పటి వరకు జిల్లా నుంచి 135 కంపెనీలు, పరిశ్రమలు, సర్వీస్‌ సెంటర్లు డీట్‌ యాప్‌లో నమోదు చేసుకున్నాయి. జిల్లాకు చెందిన 2,911 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఆరుగురు ఉద్యోగాలు పొందారు. రాష్ట్రవ్యాప్తంగా 54 మంది ఈ యాప్‌ ద్వారా ఉద్యోగాలు సాధించగా అందులో ఆరుగురు జిల్లా నుంచి సెలక్ట్‌ అయినవారే. నిరక్షరాస్యుల నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగినవారు ఎవరైనా ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఒక్కసారి రిజస్టర్‌ చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రైవేట్‌రంగంలో ఖాళీలు ఉన్నా వారి అర్హతల ఆధారంగా అవకాశం పొందవచ్చు. ఈ నెల 8న జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన అడిషనల్‌ కలెక్టర్‌ అశ్వినీ తానాజీ వాకడే, ఏఐ ఆధారిత డీట్‌ యాప్‌పై నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఫ డీట్‌ యాప్‌ ప్రయోజనాలు...

డీట్‌ యాప్‌ నిరుద్యోగ యువతకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. మోసపూరిత కంపెనీల భయం లేకుండా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వివిధ నైపుణ్యాలు, అర్హతలు కలిగిన అభ్యర్థులకు తగిన ఉద్యోగాలను సూచిస్తుంది. నిరంతర నియామక ప్రక్రియలతో సమర్థవంతమైన సేవలందిస్తుంది. రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లు, జాబ్‌ ఫెయిర్లలో అవకాశాలు కల్పిస్తుంది.

ఫ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఇలా...

ఆన్‌లైన్‌లో ఛ్ఛ్ఛ్టీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ నుంచి లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డీట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, సెల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, విద్యార్హతలు, టెక్నికల్‌ కోర్సులు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆశించే ఉద్యోగరకం, పనిచేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి

ఫ నిరుద్యోగులకు ప్రయోజనకరం..

- వి సాల్మన్‌ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్‌ యాప్‌ నిరుద్యోగ యువతకు ప్రయోజనరంగా ఉంది. ఈ డీట్‌ యాప్‌లో 135 కంపెనీలు, 2,911 మంది నిరుద్యోగ యువత వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వీటితో ఇప్పటికే జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డీట్‌లో నమోదు చేసుకున్న యువతకు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పుటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

Updated Date - Jul 25 , 2025 | 01:11 AM