గ్రామ కమిటీలతో నేర నియంత్రణ
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:44 AM
గ్రామకమిటీలను నేరాల నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.
కోనరావుపేట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామకమిటీలను నేరాల నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. కోన రావుపేట మండలం కనగర్తిలో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి కేసుల్లో ఇరుక్కో కుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్కసారి కేసులో ఇరుక్కుం టే ఎప్పటికీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉందన్నారు. బాల్యవివాహాలు చేసుకున్న వారికి ఆరోగ్య సమస్యలతోపాటు, చేయించినవారికి, ప్రోత్సహించిన వారికి రెం డేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుందన్నారు. గ్రామాల్లో నేరనియంత్రణ కోసం అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలు ఇరుప క్షాలకు మద్యవర్తిత్వంగా ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలో ఉచిత న్యాయసేవా కేంద్రం ఉందని, నిరుపేదలు సహాయాన్ని పొందవచ్చన్నారు. మహిళలు, ఎస్సీలు, దివ్యాంగులు, ఉచిత న్యాయ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ మాట్లాడుతూ సివిల్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకుంటే, కేసు కొట్టేయడంతో పాటు ఆ కేసుల్లో కోర్టుకు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుందన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్య క్రమాన్ని సద్వినియోగంచేసుకోవాలని అన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:44 AM