ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:19 AM

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

గోదాంను ప్రారంభిస్తున్న విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

-విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌ ఏప్రిల్‌ (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో నూతనంగా నిర్మించిన నూతన సంఘ భవనం మరియు గోదాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా విప్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు. తాలు తప్ప పేరిట ఎటువంటి కటింగ్‌ లేకుండా చూడాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో పూర్తిగా కలెక్టర్‌ పర్యవేక్షణలో వడ్ల కొనుగోళ్లు కొనసాగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోనుగోటి శ్రీనివాస్‌, వెల్గటూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ గోలి రత్నాకర్‌, ఎండపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ గూడ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుండాటి గోపిక జితేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ తిరుపతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌ రెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ మద్దుల గోపాల్‌ రెడ్డి, పీఏసీఎస్‌ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

ఫపెగడపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని పెగడ పల్లి సింగిల్‌విండో పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రాజారాంపల్లిలో మహిళా సంఘాల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన , రాములపల్లిలో నంచర్ల సింగిల్‌విండో ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. ఈ సంద ర్భంగా లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్రాలలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వరుస క్రమంలో తూకం వేస్తూ , వెంట వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకో వాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమాలలో తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ రాములు గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వేణు గోపాల్‌, సీఈవోలు గోపాల్‌ రెడ్డి, మధూకర్‌, ఏపీఎం సమత, పార్టీ నాయకులు ఒరుగల శ్రీనివాస్‌, సంధి మల్లారెడ్డి, శోభారాణి, అమిరి శెట్టి లక్ష్మినారాయణ, కడారి తిరుపతి, చెట్ల కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:20 AM