నగరంలో తిరుగులేని శక్తిగా సీపీఐ
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:15 AM
నగరంలో సీపీఐ తిరుగులేని శక్తిగా అవతరించాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని బద్దంఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ నగర 11వ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఐ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఎర్ర జెండా అంటేనే దోపిడీ దారులకు పేదలకు అణచివేసే వారికి గుండెల్లో రైళ్లుపరిగెడతాయన్నారు.
భగత్‌నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): నగరంలో సీపీఐ తిరుగులేని శక్తిగా అవతరించాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని బద్దంఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ నగర 11వ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీపీఐ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఎర్ర జెండా అంటేనే దోపిడీ దారులకు పేదలకు అణచివేసే వారికి గుండెల్లో రైళ్లుపరిగెడతాయన్నారు. స్మార్ట్‌సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై పాలక ప్రభుత్వాలు నోరు మెదపడం లేదన్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్‌లో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటం చేయాల్సిన అవసరంఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి జెండా ఆవిష్కరించారు. మహసభలకు న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ అధ్యక్షత వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. సమావేశంలో పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, శారద, బోనగిరి మహేందర్, గామినేని సత్యం, కొట్టె అంజలి, ఎలిశెట్టి భారతి పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:15 AM