ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాఫిక్‌ సమస్యలపై సీపీ సమీక్ష

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:17 AM

కరీంనగర్‌లో ట్రాఫిక్‌ సమస్యలపై పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం శుక్రవారం కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసు ఠాణాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీపీ సమక్షంలో సైలెన్సర్‌లను బుల్డోజర్‌తో ధ్వంసం చేయిస్తున్న పోలీసులు

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ట్రాఫిక్‌ సమస్యలపై పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం శుక్రవారం కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసు ఠాణాలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అమలు చేసే విధానం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను సురక్షిత కస్టడీలోకి తీసుకోవడం, కోర్టులో హాజరుపరిచి నిందితు లకు జరిమానాలు, శిక్ష పడేలా తీసుకుంటున్న చర్యలపై సీపీ ఆరా తీశారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించినవారిని గుర్తించి ఫొటోల ద్వారా ఈ-చాలన్లు విధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మోటార్‌ సైకిల్‌ సైలెన్సర్లను మార్చి అధిక శబ్ధాన్నిచ్చే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నవారిని గుర్తించి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో రోడ్డు రోలర్‌ సహాయంతో 243 సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. నగరంలో పార్కింగ్‌ సమస్య ఉందని, దానిని అధిమగించేందుకు మున్సిపల్‌ అధికారులతో చర్చించి తగిన ప్రదేశాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నగరంలో సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ నిబంధనల పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంపింగ్‌, సీట్‌ బెల్ట్‌ లేకుండా డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌ ఉపయోగించడం, ట్రిపుల్‌ రైడింగ్‌, అతివేగం, రాష్‌ డ్రైవింగ్‌ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్‌ చలాన్లు జారీ చేయనున్నట్లు కమిషనర్‌ హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో ట్రాఫిక్‌ ఏసీపీ యాదగిరిస్వామి, సీఐలు కరీంఉల్లాఖాన్‌, పర్సరమేష్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

3జిఎన్‌వి27

3జిఎన్‌వి27, సీపీకి స్వాగతం పులుకుతూ పూలమొక్కను అందజేస్తున్న ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి

4జిఎన్‌వి27, రిసెప్షన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న సీపీ గౌస్‌ ఆలం

గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

గన్నేరువరం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌ను కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ గౌస్‌ ఆలం కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ శుభంప్రకాష్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బంది పరేడ్‌ను పర్యవేక్షించి పరిసరాలను పరిశీలించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు విధులపై సూచనలు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ సదన్‌కుమార్‌, ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:17 AM