ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్తపల్లిలో కార్డన్‌ సెర్చ్‌

ABN, Publish Date - Aug 02 , 2025 | 12:20 AM

కొత్తపల్లి పోలీసు ఠాణా పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగాయి. పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరాదీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి పోలీసు ఠాణా పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పలు అంశాలపై తనిఖీలు కొనసాగాయి. పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరాదీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 43 బైకులు, 2 ఆటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశా లపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరును వివరించి, సైబర్‌ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి, నేరం జరిగిన గంట లోపల 1930 నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్‌ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. షీ టీం సీఐ శ్రీలత సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల గురించి విద్యార్థినిలకు వివరించారు.

ఫ అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు:

చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్‌ కమీషనర్‌ గౌష్‌ ఆలం హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్‌ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్‌ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు, విద్యార్థులు, అధికారులంతా ప్రతిజ్ఞ చేశారు. సే నో టు డ్రగ్స్‌ పోస్టర్‌ను సీపీ ఆవిష్కరంచారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐ నిరంజన్‌ రెడ్డి, శ్రీలత, పుల్లయ్య, ప్రదీప్‌ కుమార్‌, పోలీసు అధికారులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:20 AM