ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమన్వయాన్ని కొనసాగించాలి

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:40 PM

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పోలీసు అధికారులతో సమన్వయంతో లోక్‌ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యాయని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సమన్వయాన్ని కొనసాగించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కమిషనరేట్‌ కేంద్రంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహిం

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పోలీసు అధికారులతో సమన్వయంతో లోక్‌ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యాయని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సమన్వయాన్ని కొనసాగించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కమిషనరేట్‌ కేంద్రంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,478 కేసులను పరిష్కరించినందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను అభినందించారు. అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు భాగస్వాములు కావాలని, పోలీసు అధికారుల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్‌బీ ఏసీపీ జి విజయ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఫర్‌ ప్రాసిక్యూషన్‌ డి శరత్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జె శ్రీరాములు, అడిషనల్‌ పీపీలు రాములు, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఝాన్సీ, ఏపీపీలు గాయత్రి, వీరాస్వామి, రంజిత్‌కుమార్‌, సీఐలు సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:40 PM