ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:13 AM

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు మత్తు, సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ మహేశ్‌ బి గితే అన్నారు.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు మత్తు, సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ మహేశ్‌ బి గితే అన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలు, రికార్డులు, పెండింగ్‌ కేసులు, స్టేషన్‌ పరిధిలోని గ్రామాల వివరాలను పరిశీలించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మహేశ్‌ బి గితే మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులు, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అ న్నారు. పల్లెల్లో అలజడులు సృష్టిస్తే కేసులు తప్ప వని హెచ్చరించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వారి సమస్యలను తెలుసుకుని మేమున్నామని భరోసా కల్పించేలా చూస్తున్నామని అన్నారు. చట్టం పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నిత్యం గ్రామాల్లో గస్తీ కాసి దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ మహేశ్‌ బి గితే కోరారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్‌ఐ రమాకాంత్‌ ఉన్నారు.

వీర్నపల్లిలో..

వీర్నపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేం దుకు మారుమూల అటవీ పల్లెలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు. వీర్నపల్లి మండల పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను పరిశీ లించారు. గతంలో జరిగిన సంఘటన వివరాలు, సిబ్బంది విధులని అడిగి తెలుసుకున్నారు. మం డల పరిధిలోని గ్రామాల వివరాలను మ్యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ గ్రామాల్లో రౌడీ షీటర్‌లతో పాటు అనుమానిత వ్యక్తులను పోలీసులు పెట్రోలింగ్‌ సమయంలో తనిఖీ చేస్తూ వారి స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. మత్తు పదార్థాలు, సైబర్‌ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. గంజాయి సేవించడం, అక్రమంగా రవాణా చేయడంపై సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా మెలగాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురా వాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఎస్పీకి పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట సిఐ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎస్సై ఎల్లయ్య గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:13 AM