ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కానిస్టేబుళ్లు టెక్నాలజీపై పట్టు సాధించాలి

ABN, Publish Date - Jul 29 , 2025 | 12:37 AM

కానిస్టేబుళ్లకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు.

కరీంనగర్‌ క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుళ్లకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై పట్టు సాధించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో బ్యాచ్‌ శిక్షణను సీపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌ కేంద్రంలోని ఐటీ కోర్‌ కార్యాలయంలో పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్‌లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. నేరాల ఛేదనలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు జి విజయ కుమార్‌, వేణుగోపాల్‌, సీఐ తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:37 AM